తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో.. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్‌పై దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ అతణ్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పాత కక్షలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలే హత్యాయత్నానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అనుచరుడైన శ్రీనివాస్‌పై.. అతను నిర్మిస్తున్న భవనం వద్దే దాడికి దిగారు.
ఇదీ చదవండి: రాచగున్నేరి పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం