తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని ముగ్గురు కరోనా బాధితులను.. రాజమహేంద్రవరం ఆసుపత్రికి అధికారులు తరలించారు. ఏనుగుమహల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, బోడిపాలెం వంతెన ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు.. నెల క్రితం కూరగాయలను తీసుకుని చెన్నైలోని కోయంబేడు మార్కెట్కు వెళ్లారు.
లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండి... తిరిగి ఈ నెల 10న కొత్తపేట శివారు బోడిపాలెం చేరుకున్నారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు అమలాపురం ఆర్డీవో భవాని శంకర్ తెలిపారు. ఈ ముగ్గురినీ రాజమహేంద్రవరం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ఇదీ చదవండి: