తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండి గ్రామంలో దారుణం జరిగింది. గోదావరి ఒడ్డున.. ఇద్దరు చిన్నారులతో సహా పురుగుల మందు తాగి ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు వారు గుర్తించారు. మృతిచెందిన వారు పి.గన్నవరం మండలం కందాలపాలెం గ్రామానికి చెందిన సవరపు విశ్వనాధం (33) తన ఇద్దరు పిల్లలు రేవంత్ (9), జెస్సికా (8)లుగా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే.. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
sexual harassment: వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. ప్రభుత్వం సీరియస్