తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో ఎన్నికల లెక్కింపు కేందంలోకి కొందరు చొరబడి బ్యాలెట్ పత్రాలు అపహరించడం తీవ్ర కలకలం రేపింది. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న సుశీల... ప్రత్యర్థి నాగభారతిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ సమాచారం అందుకున్న కొందరు బయటి నుంచి లెక్కింపు కేంద్రంలోకి వెళ్లి బ్యాలెట్ పత్రాలు అపహరించి వెళ్లిపోయారు. ఈఘటతో కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకొంది. దీంతో సుశీల మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఓడిపోతుందనే నాగభారతి మద్దతుదారులు బ్యాలెట్ పత్రాలు అపహరించారని సుశీల వర్గీయులు ఆరోపించారు. పోలీసులు... పోలింగ్ సిబ్బందికి రక్షణ కల్పించారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి