తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలంలోని తాటిపాకకు చెందిన కాళిశెట్టి శ్రీహరిరావు... మతిస్థిమితం లేక 30 ఏళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పట్లో కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న శ్రీహరిరావుకు స్వల్ప గాయాలయ్యాయి. అక్కడి జనసైనికులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు.
వారికి తన ఊరు తాటిపాక అని తెలపగా.. అతని ఫొటోలు, వివరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఆ వివరాలను తాటిపాకకు చెందిన చిరుపవన్ సేవా సమితి సభ్యులు ఆరా తీసి శ్రీహరిరావు కుటుంబ సభ్యులను గుర్తించారు. సోమవారం ఎచ్చెర్ల జనసైనికులు శ్రీహరిరావును రాజోలుకు తీసుకువచ్చి అతడి చెల్లెలు అనంతలక్ష్మికి అప్పగించారు. ఆమె జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీ చదవండి: