తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం వెళ్తున్న కారును లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పార్వతి అనే మహిళకు కాలు విరిగింది. మహాలక్ష్మి అనే మహిళ తీవ్రగాయాలపాలయ్యారు. మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం వీరిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇది చదవండి రంపచోడవరం నియోజకవర్గంలో రెండో రోజు బంద్