తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మ లోవ దేవస్థానం ఈవోగా రమేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. గతంలో అంతర్వేది దేవస్థానానికి, తలుపులమ్మ లోవ దేవస్థానానికి చక్రధర్ రావు ఈవోగా వ్యవహరించారు. అంతర్వేదిలో రథం దగ్ధం అయిన ఘటనతో ఈవో చక్రధర రావును ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యతల నుంచి తప్పించింది. అన్నవరం దేవస్థానం సహాయ కమిషనర్ రమేష్ బాబును తలుపులమ్మ లోవ దేవస్థానం ఈవోగా నియమించింది. ఈ క్రమంలో ఆయన లోవ అమ్మవారిని దర్శించుకుని ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చదవండి: