తూర్పు గోదావరి జిల్లా తుని మండలం కొలిమేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. కోటనందూరు మండలం అగ్రహారం నుంచి తొండంగి వెళ్తున్న ఆటో, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. దీంతో ఆటో బోల్తా పడి.. డ్రైవర్, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారుడు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: 'పబ్జీ' గొడవలో 13 ఏళ్ల బాలుడి హత్య!