ETV Bharat / state

'కోడెల మరణం రాష్ట్రానికి తీరని లోటు'

మాజీ స్పీకర్​ కోడెల శివప్రసాదరావు మరణం రాష్ట్రానికి తీరని లోటని తెదేపా సీనియర్​ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల వల్లే ఆయన మరణించారని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.

కోడెల శివప్రసాదరావు మరణం
author img

By

Published : Sep 16, 2019, 7:31 PM IST

'కోడెల మరణం రాష్ట్రానికి తీరని లోటు'

మాజీ స్పీకర్​ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల తెదేపా సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తెదేపాకు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కక్షసాధింపు చర్యల వల్లే కోడెల శివప్రసాదరావు మరణించారని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై రాజకీయ దాడులు ఆపాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల శివప్రసాద్‌ మరణం సంభవించిందని మాజీ హోంమంత్రి, తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప అభిప్రాయపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన పరిణామాలు ఆయన్ని మానసికంగా దెబ్బతీశాయని రాజమహేంద్రవరంలో అన్నారు.

రాజకీయాల్లో తనదైన ముద్ర
కోడెల శివప్రసాదరావు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పేదలకు వైద్యుడిగా విశేష సేవలందించారని కొనియాడారు. ఇటీవల పరిణామాలపై తన వద్ద అనేకసార్లు బాధ పడ్డారని తెలిపారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, తెదేపా సీనియర్​ నేత పితాని సత్యనారాయణ కూడా కోడెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇటీవలి పరిణామాలతో కోడెల మానసిక క్షోభకు గురయ్యారని అన్నారు. ఆయన మృతి తనకు తీరని లోటని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : ప్రభుత్వ వేధింపుల కారణంగానే.. కోడెల ఇలా: సోమిరెడ్డి

స్వామి వివేకానంద అ చికాగో ఉపన్యాసం 125 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆరు జిల్లాల్లో పర్యటించే వివేకానంద రథయాత్ర నేడు కడప జిల్లా వేంపల్లె కు చేరింది. వేంపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో స్వామి సుకృత నందాజీ వేంపల్లి ఫారెస్ట్ అధికారి స్వామి వివేకానంద ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ ప్రైవేటు సంస్థల కరస్పాండెంట్ రామాంజి రెడ్డి చక్రపాణిరెడ్డి మానవతా సభ్యులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. యాంకర్ వాయిస్:: కడప జిల్లా వేంపల్లె ఆర్టీసీ బస్టాండు నుండి నాలుగు రోడ్ల కూడలి మీదుగా అ పులివెందుల రోడ్డు లో ఉన్న ఐ టి ఐ వరకు ఈ రథ యాత్ర సాగింది. వివేకానంద రథయాత్రకు స్వామి వివేకానంద హై స్కూల్ కరస్పాండెంట్ రామాంజి రెడ్డి నేతృత్వంలో ఊహించారు. ఈ రథయాత్ర లో వేంపల్లి లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ పాల్గొన్నారు. ఇతరుల కోసం జీవించే వారే గొప్పవారు అవు తారఅన్నారు. నైతిక విలువలతో తో కూడిన జీవితం గడపాలన్నారు .స్వామి వివేకానంద యువతకు ఆదర్శం అని కొనియాడారు విద్యార్థులకు స్వామి వివేకానంద అ గురించి వివరించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.