ETV Bharat / state

RALLY: ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. తెదేపా నేతల ఆగ్రహం - rally in kadiyam

తూర్పుగోదావరి జిల్లా కడియంలో తెదేపా నేతలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. అనంతరం కడియం తహశీల్దార్​కు వినతిపత్రం సమర్పించారు.

ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
author img

By

Published : Sep 16, 2021, 6:09 PM IST

ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం నేతలు ర్యాలీ చేపట్టారు. మాజీ మంత్రి జవహర్​తో కలిసి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మోరంపూడి జంక్షన్ వద్ద నిరసనకారులను కొద్దిసేపు ఆపారు. కడియం చేరుకున్న తర్వాత ట్రాక్టర్లను నిలిపివేశారు. పోలీసులు చర్యలను నిరసిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నాయకులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కడియం తహసీల్దార్​కు వినతిపత్రం సమర్పించారు.

పాత బకాయిల పేరుతో నెత్తిన పిడుగు వేస్తున్నారు. పేదవాళ్లు కట్టుకున్న ఇళ్లకు డబ్బులు వసూలు చేస్తామని చెప్పడం దౌర్భాగ్యం. పెరిగిన ధరలతో బతకలేక సామాన్యుడి నడ్డి విరుగుతోంది. మేము చేస్తున్న ఈ రైతు ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వానికి ఉరి వేస్తుంది. -గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఇదీచదవండి.

మహిళలకు సైబర్ బెదిరింపుల కేసులు... తెలంగాణలోనే అత్యధికం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.