రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు పేట్రేగిపోతున్నాయని తెలుగు దేశం నేతలు మండిపడుతున్నారు. తరచూ ఘటనలు జరుగుతున్నా.. ఇంతవరకూ ఒక్క నిందితుడిని అరెస్టు చేయలేదని... రాజమహేంద్రవరంలో ఆ పార్టీ నేతలు జవహర్, బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ తెదేపా బృందం ఏఎస్పీకి వినతిపత్రం అందించారు. గతంలో ఇదే విషయమై ఎస్పీని కలిసేందుకు ప్రయత్నించినా.. ఆమె నుంచి అనుమతి రాలేదన్నారు.
ఇదీచదవండి.