తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలోని దళితులకు ఇచ్చిన ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని తెదేపా ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. సుమారు పది కోట్ల రూపాయలు విలువ చేసే చైనా క్లే ను ఇప్పటివరకు కొల్లగొట్టారని ఆరోపించారు. మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.
అక్రమ మైనింగ్ పై ప్రశ్నిస్తే.. అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెబుతున్నారని జ్యోతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రామవరంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సత్వరమే స్పందించి... కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: