తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్‌కు తెదేపా తరఫున ఆర్థిక సహాయం అందింది. పార్టీ అధినేత పంపించిన రూ. 2 లక్షల చెక్కును స్థానిక నాయకులు ప్రసాద్‌కు అందజేశారు.
బాధితుడు ఆత్మస్థైర్యం కోల్పోకూడదని... ధైర్యంగా ఉండాలనే ఉద్దేశంతో తెదేపా తరుపున ఈ సాయాన్ని చేస్తున్నట్లు ఆదిరెడ్డి వాసు చెప్పారు. ప్రసాద్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. బాధితుడు ప్రసాద్‌కు న్యాయం చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితునికి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.