ETV Bharat / state

ఏమున్నా నిర్మొహమాటంగా చెబుతా: గోరంట్ల

Buchhaiah Chowdary
Buchhaiah Chowdary
author img

By

Published : Aug 19, 2021, 12:14 PM IST

Updated : Aug 20, 2021, 5:09 AM IST

12:13 August 19

గోరంట్ల బుచ్చయ్య చౌదరి

గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందన ఇదే

   తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం గురువారం జోరుగా సాగింది. తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్‌ నేత.. ఆరుసార్లు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన రాజీనామా కలకలం చర్చనీయాంశమైంది. సీనియర్‌గా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, పార్టీలో సమస్యలపై సూచనలు పాటించకపోవడం.. బుచ్చయ్య సూచించిన వారికి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివి తాజా పరిణామాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. త్వరలో జరగనున్న రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓ వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో ఫోన్లో మాట్లాడేందుకు గోరంట్ల ప్రయత్నించి భంగపడినట్లు తెలుస్తోంది.

తనకు గుర్తింపు లేనప్పుడు దూరంగా ఉండటమే మేలని భావించి బుచ్చయ్య చౌదరి రాజీనామా యోచనలో ఉన్నారనే ప్రచారం సాగింది. గురువారం ఉదయం నుంచి రాజీనామాపై భిన్న స్వరాలు వినిపిస్తున్నా ఆయన మీడియాతో మాట్లాడకుండా ఇంట్లోనే ఉన్నారు. అధిష్ఠానం సూచనతో మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్‌ జవహర్‌, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు బుచ్చయ్య నివాసానికి చేరుకుని బుజ్జగించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో ఫోన్లో మాట్లాడించారు. ఏమైనా సమస్యలుంటే కూర్చుని మాట్లాడదామని వాళ్లు చెప్పడంతో సమస్య సద్దుమణిగినట్లయింది.

మాట్లాడి పరిష్కరించుకుంటాం: చినరాజప్ప

‘బుచ్చయ్య లాంటి సీనియర్‌ నాయకుల అభిప్రాయాలను పార్టీ గౌరవిస్తుంది. త్వరలో చంద్రబాబు దగ్గరకెళ్లి ఈ విషయాలపై మాట్లాడతాం. రాజమహేంద్రవరంతో పాటు మరికొన్ని సమస్యలను బుచ్చయ్య వివరించారు. సీనియరైన తనను గౌరవించడం లేదనే ఇబ్బంది ఉందన్నారు. వీటన్నింటినీ చంద్రబాబు పరిష్కరిస్తారు.’

ఏమైనా ఉంటే నేనే చెబుతా: బుచ్చయ్య

‘స్థానికంగా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీపరమైన సమస్యలున్నాయి. అవన్నీ అంతర్గత విషయాలు కనుక నేను ఇక్కడేమీ మాట్లాడను. లోపల మాట్లాడతా. చెప్పాల్సింది ఏమైనా ఉంటే నేనే పిలుస్తా. రకరకాలుగా ఊహించుకోవద్దు. ఏదైనా ఉంటే అందరినీ పిలిచి నిర్మొహమాటంగా చెప్పడం నాకు అలవాటు. ఏదైనా ఉన్నప్పుడు నేను స్వయంగా పిలిచి చెబుతా. తెదేపాతో నాకు 39 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఎన్టీఆర్‌ ఆత్మగౌరవం నినాదంతో వచ్చా. 76 ఏళ్ల వయసులో ప్రమోషన్లు, మంత్రి పదవులు, మళ్లీ పోటీ.. ఇలా ఇంకా ఏదో ఆశించడం లేదు. పార్టీ విషయాలు నా దృష్టికి వచ్చాయి కాబట్టి మాట్లాడుతున్నా. అవన్నీ అంతర్గతంగా చెబుతా. నేనొక్కడినే తప్ప, నా కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లో లేరు. వారసులూ లేరు. నేనెప్పుడూ ఎవరికీ పదవులు ఇవ్వలేదు.. ఇవ్వాల్సిన అవసరం లేదు. నా వరకు ఒక సీనియర్‌ కార్యకర్తగా పార్టీ అప్పజెప్పిన ప్రతి పనీ చేసుకుంటున్నా’ అని బుచ్చయ్యచౌదరి విలేకరులతో చెప్పారు.

ఇదీ చదవండి:

Ys Viveka Murder Case: వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్ సన్నిహితుడు శివశంకర్ రెడ్డి విచారణ

Last Updated : Aug 20, 2021, 5:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.