తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జీబీఆర్ కళాశాలలో... శ్రీ రామకృష్ణా సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంత్యుత్సవం 2020 కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో సేవలందిస్తోన్న ప్రముఖులకు వివేకానంద జీవన సాఫల్య పురస్కారాలను నిర్వాహకులు అందజేశారు. సాహిత్య రంగంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, సినిమా రంగంలో ఆర్.నారాయణమూర్తి, సామాజిక సేవా రంగంలో హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డీలను పురస్కారాలు వరించాయి. రాజకీయ, సామాజిక రంగంలో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణా రావుకి బదులుగా ఆయన సతీమణి ఉదయలక్ష్మీకి పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి వినిశ్చలందజీ మహారాజ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇదీ చూడండి: