ప్రభుత్వ అవసరాలకు అవసరమైన చర్యల్లో భాగంగా చేపడుతున్న భూ సేకరణకు రైతులు సహకరించాలని.. తూర్పు గోదావరి జిల్లా సబ్ కలెక్టర్ అనుపమ అంజలి సూచించారు. సీతానగరం మండలం నాగంపల్లిలో భూసేకరణకు సంబంధించిన భూములు కోసం సబ్ కలెక్టర్ క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా.. చేపడుతున్న భూ సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, రైతులు ముందుకు రావాలన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: