పాలిటెక్నిక్ చదువుతున్న ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరానికి చెందిన పట్టెం ఉమేష్ కుమార్ (21).. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానిక కళాశాలలో పాలిటెక్నిక్ తృతీయ సంవత్సరం చదివాడు.
సెలవుల కారణంగా కొన్నాళ్లుగా ఇంట్లోనే ఉన్నాడు. తల్లి నూకరత్నం మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఉరివేసుకుని కనిపించాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఓ సూసైడ్ లెటర్ రాసి జేబులో పెట్టుకుని బలవన్మరణం చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: