పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని తల్లిదండ్రులకు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఆదిమూలం వారి పాలెంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన సెంటర్ను సందర్శించారు. అనంతరం అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆడ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని... ఆ దిశగా వాళ్లను ప్రోత్సాహం అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. బాల్య వివాహాలు, దిశ చట్టం, తదితర అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి:
'జగనన్న తోడు' ప్రారంభం.. చిరు వ్యాపారుల ఖాతాల్లోకి రూ. 905 కోట్లు