తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరంలో రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పోటీదారులు హాజరయ్యారు. పోలవరం కాలువ గట్టున పందాలు నిర్వహించడం ప్రమాదకరమన్న పోలీసులు.. కమిటీ, గ్రామస్థులతో చర్చించి పోటీలు నిర్వహించారు.
సీనియర్, జూనియర్ విభాగాలలో ఈ పోటీలు జరిగాయి. సీనియర్ విభాగంలో 5 బండ్లు, జూనియర్ విభాగంలో 51 ఎడ్ల బండ్లు పందాల్లో పాల్గొన్నాయి. సీనియర్, జూనియర్ విభాగాల్లో కోరా శృతి చౌదరికి చెందిన ఎడ్లు ప్రథమ స్థానాల్లో నిలిచాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు.
ఇదీచదవండి.