కేంద్ర పాలిత ప్రాంతం యానంలో మూతబడిన మద్యం షాపుల్లో నిల్వల లెక్కలను పుదుచ్చేరి నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు చూస్తున్నారు. యానంలో 21 మద్యం దుకాణాలు తెరిచేందుకు మే 14వ తేదీన పుదుచ్చేరి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 4వ తేదీ నుంచి మద్యం అమ్మకాలకు అనుమతిని ఇచ్చింది. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానంలోనూ మద్యం విక్రయాలు జరిగాయి. లాక్డౌన్ సమయంలో వ్యాపారులు అనధికారికంగా విక్రయాలు జరిపారని... రాష్ట్ర గవర్నర్ కిరణ్ బేడికి ఫిర్యాదులు అందాయి. తనిఖీలు చేయాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. సెక్రటరీ స్థాయి అధికారి అధ్యక్షతన 10మంది ఇతర ఉద్యోగులు కలిసి 5 బృందాలై... ప్రతి షాపులలోని మద్యం నిల్వలను లెక్కలు చూస్తున్నారు. మార్చి 24 తేదీన ఉన్న నిల్వలకు ప్రస్తుతం తనిఖీలో నమోదైన నిల్వలకు... వ్యత్యాసం ఉంటే షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.. రెండు రోజుల్లో తనిఖీలు పూర్తిచేసి... నివేదికను గవర్నర్కు పంపిచనున్నారు. ఆ తరువాతే మద్యం అమ్మకాలకు అనుమతి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దీంతో రెండు వారాలుగా మద్యం కోసం ఎదురుచూస్తున్న మందుబాబులు మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు.
యానంలోని మద్యం షాపుల్లో ప్రత్యేక అధికారుల తనిఖీలు
కేంద్ర పాలిత ప్రాంతం యానంలో మూతబడిన మద్యం షాపుల్లో నిల్వల లెక్కలను పుదుచ్చేరి నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు చూస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వ్యాపారులు అనధికారికంగా విక్రయాలు జరిపారని... రాష్ట్ర గవర్నర్ కిరణ్ బేడికి ఫిర్యాదులు అందాయి. తనిఖీలు చేయాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు.