తూర్పుగోదావరి జిల్లాలో నాటుసారా, గంజాయి తయారీ, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు(SP Ravindranath Babu visit p.gannavaram ps). గడిచిన మూడు నెలల కాలంలో జిల్లాలో సుమారు రూ.8 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకొని పలువురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నాటు సారా తయారీ వ్యాపారంపై ఆధారపడేవారికి కౌన్సెలింగ్ ఇచ్చి, మరో వృత్తిలో ఉపాధి కల్పించేందుకు 'పరివర్తన' అనే కార్యక్రమాన్ని నవంబర్ నుంచి చేపడతామన్నారు(SP Ravindranath Babu on parivartana program).
వార్షిక తనిఖీల్లో భాగంగా పి. గన్నవరం పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ రవీంద్రనాథ్ బాబు.. స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసులు నమోదు, పరిష్కారం, దిశ చట్టం, తదితర అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఇదీ చదవండి..
YV SubbaReddy: కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేకపోతున్నారు: వైవీ సుబ్బారెడ్డి