తూర్పు గోదావరి జిల్లా వీరవరంలో కారుతో ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన బాలుడు శివ కుటుంబాన్ని ఎస్పీ నయీమ్ అస్మి పరామర్శించారు. బాలుడి చిత్రపటానికి ఎస్పీ, ఇతర సిబ్బంది నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్పీ "ఇదీ మాటల్లో చెప్పలేని ఘోరం. తండ్రి, కొడుకులను కారుతో ఢీకొనటమే కాకుండా.. రాడ్తో దాడి చేయటం దారుణం. హంతకున్ని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకొంటాం. అలాగే కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చూస్తాం" అని ఎస్పీ అన్నారు.
ఇదీ చదవండీ... 'నా కుమారుడి హంతకుడికి ఉరిశిక్ష వేయండి.. మాకు న్యాయం చేయండి'