పొద్దున్నే అలవాటు ప్రకారం 'ఈనాడు' చదువుతున్నాను. రెండో పేజీలోకి రాగానే, ‘మనిషిని నేను’ అంటూ అమలాపురానికి చెందిన తంగెళ్ల రాజగోపాల్ రాసిన కవితకు ప్రథమ బహుమతి వచ్చింది. ఒకసారి చదివాను. ఎందుకో పాడుకోవాలనిపించింది. ఎవరైనా వింటారని కాదు... వినాలని కాదు... నాకు అనిపించింది. అందుకే పాడుతున్నా. శ్రుతి, లయ ఏవీ లేవు. చేతిలో సెల్‌ఫోన్ మాత్రమే ఉంది. మా కుక్క పిల్లలు కూడా అరవొచ్చు. కాకపోతే నా చుట్టుపక్కల ట్రాఫిక్, ఇతర శబ్దాలు లేవు. కనీసం నాకోసం నేను పాడా. -ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం
ఇదీ చదవండీ... రాష్ట్రంలో 180 కరోనా పాజిటివ్ కేసులు