తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆర్టీసీ డిపో కార్మికులు మెరుపు సమ్మె చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను నేరవేర్చాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు. ఈ సమ్మెలో 416 మంది కార్మికులు పాల్గొన్నారు. ఫలితంగా బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. కార్మికులకు ఎనిమిది గంటల డ్యూటీ విధానం అమలు చేయాలన్నారు. విజయవాడ డ్యూటీకి వెళ్లే డ్రైవర్‌కు రెండు రోజుల డ్యూటీ అమలు చేయాలని...పని భారం తగ్గించాలని...డిపో ఎదుట నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు విధులకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు.
సమస్యలు పరిష్కరించాలని...ఆర్టీసీ కార్మికుల మెరుపు సమ్మె - solve their problems RTC workers strike
అమలాపురంలో ఆర్టీసీ డిపో కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మెరుపు సమ్మె చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు విధులకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు.