తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేటకు చెందిన సైనికుడు రాసబోయిన వెంకన్న తీవ్ర అస్వస్థతతో గువహటిలో మరణించారు. 15 ఏళ్లుగా సైన్యంలో సేవలు అందిస్తున్న వెంకన్న ఇటీవలే పదోన్నతి పొందారు. నాలుగైదు రోజుల్లో విధుల్లో చేరాలని భావిస్తుండగా తీవ్ర జ్వరం, గుండె నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ వెంకన్న మృతి చెందారు. వెంకన్నకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సైనికుడు వెంకన్న పార్థివదేహన్ని స్వగ్రామానికి తీసుకొస్తున్నారు.
ఇవీ చదవండి