తూర్పుగోదావరి జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఆలమూరు మండలంలో దాడులు నిర్వహించి మూడు చౌక దుకాణాలు సీజ్‌చేసి.. ఒక రేషన్ పంపిణీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రవిప్రకాష్ ఆదేశాల మేరకు సీఐలు సత్యకిషోర్, రమేష్, తహసీల్దారు విజయకుమార్, ఎఫ్‌ఆర్‌వో వల్లిలు రెండు బృందాలుగా తనిఖీలు నిర్వహించారు. సత్యకిషోర్ మాట్లాడుతూ మూలస్థానం అగ్రహారంలోని రెండు దుకాణాలు, మడికిలోని ఒక దుకాణంలో తనిఖీ చేయగా.. బియ్యం, కందిపప్పు, పంచదార నిల్వల్లో తేడాలు గుర్తించి సీజ్ చేశామన్నారు.
మడికిలోని ఇంటింటికీ ఇచ్చే రేషన్ సరకులు ఇచ్చే వాహనంలోని ఉండే సరకుల నిల్వ, ఎండీఎం యంత్రంలో లెక్కలకు తేడాలు గుర్తించామన్నారు. దీంతో వాహనాన్ని సీజ్ చేశామన్నారు. రాజమహేంద్రవరంలోని ఆదర్శనగర్‌లోని చౌక దుకాణంలో తనిఖీ చేపట్టామని.. 682 కేజీల బియ్యం నిల్వలు తక్కువగా ఉండడంతో దుకాణాన్ని సీజ్ చేశామన్నారు.
ఇదీ చదవండి: