తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో రోజుకు సుమారు 200 మందికి ఆకలి తీరుస్తున్నాడు.. శశి ఫౌండేషన్ స్థాపకుడు నీలి నరసింహరావు. అన్నార్తులు ఎక్కడ ఉన్నా.. నేనున్నా అంటూ తన కారులో ఆహార పొట్లాను తీసుకువెళ్లి అందిస్తున్నారు. లాక్డౌన్ నాటి నుంచి యాచకులు, నిరుపేదలు, ఇతర రాష్ట్రాల కార్మికులు, జాతీయ రహదారులపై స్వస్థలాలకు నడిచి వెళ్తున్న వలస జీవులకు ఆహారాన్ని అందిస్తున్నారు.
ఆకలి అనేది అన్ని జీవులకు ఉంటుందని.. గోకవరం రహదారిలో ఉండే కోతులకు సైతం బియ్యం, అరటి పళ్లు అందిస్తున్నారీ సేవకుడు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపేందుకే ఫౌండేషన్ స్థాపించానని నరసింహరావు తెలిపారు. అతడి సేవా నిరతిని స్థానికులు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: