తూర్పు గోదావరి జిల్లా కోనసీమ పరిధిలోని కొత్తపేట నియోజక వర్గంలోని రావులపాలెం.. వాణిజ్యపరంగా కీలక వ్యాపారాలు ఉన్న కేంద్రం. ప్రభుత్వం ఇచ్చిన కొన్ని సడలింపులతో మే మూడో తేదీ నుంచి దుకాణాలు తెరుచుకున్నాయి. కొత్తపేట, బండారులంకల్లో కరోనా కేసులు నమోదైన కారణంగా లాక్ డౌన్ నిబంధనలను అధికారులు మరింత కఠినతరం చేశారు.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరకుల దుకాణాలు తెరవాలని ఆదేశాలిచ్చారు. మిగిలిన ఏ దుకాణాలు కూడా తెరవకూడదని సూచించారు. నిబంధనలు అతిక్రమించి తెరిచిన వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: