మహాశివరాత్రి వేడుకలు రాజమండ్రి పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ముక్కంటి దర్శనం కోసం ఆలయాలకు భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పరమేశ్వరునికి పూజలు చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నదిలో నీరు తగ్గిపోయినా.. భక్తులు వేల సంఖ్యలో స్నానాలు ఆచరించటానికి రావటంతో నగర పాలక సంస్థ భక్తుల సౌకర్యార్థం జల్లు స్నానాలు ఏర్పాట్లు చేసింది. ఉమా కోటిలింగేశ్వర స్వామి, ఉమా మార్కండేయ స్వామి, విశ్వేశ్వరస్వామి ఆలయాల్లోని స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
ఇదీ చదవండి: నెల్లూరు జిల్లాలో నీలకంఠేశ్వరుని మహోత్సవాలు