తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో శెట్టి బలిజ వర్గీయులు భారీ ర్యాలీ నిర్వహించారు. గండేపల్లి మండలం ఉప్పలపాడుకు చెందిన యువకుడు, సీతానగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావటంతో గత నెల 30న ఉప్పలపాడులో యువతి బంధువులు.. యువకుడి తండ్రి పిల్లి గోవింద్‌పై దాడి చేశారు.
ఎస్ఐ ముందే దాడి చేస్తున్నా.. ఆపలేదు
గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ కళ్ల ముందే స్తంభానికి కట్టేసి.. కర్రలు, రాళ్లతో దాడి చేశారని, అయినప్పటికీ ఎస్ఐ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని శెట్టి బలిజ వర్గీయులు ఆరోపించారు. ఎస్ఐ శోభన్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాలు, శెట్టి బలిజలు జగ్గంపేటలో ఆందోళన చేపట్టారు. ఎస్ఐ.. యువతి సామాజిక వర్గానికి చెందిన వాడు కావటంతోనే దాడిని ఆపలేదన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు.
ఇదీ చదవండి