సేవ చేయాలని ...ఓ సెక్యూరిటీ గార్డు రోగులకు చికిత్స చేస్తూ..డాక్టర్లు లోని లేటు తీరుస్తున్నాడు. వైద్యులేని ఆ ఆసుపత్రిలో రోగులకు అతనే దేవుడిలాగా కనబడుతున్నారు. చేసేది ఏమిలేక.. ప్రాణాపాయమని తెలిసిన సెక్యూరిటీ గార్డుతోనే చికిత్సలు చేయించుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో ఎమ్ఎన్ఓ పోస్ట్ ఖాళీగా ఉండడంతో... ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు సెక్యూరిటీ గార్డే వైద్య సేవలను అందిస్తున్నాడు. గతంలో ఎమ్ఎన్ఓ ఉన్నప్పటికీ రాజమహేంద్రవరం జనరల్ ఆసుపత్రికి బదిలీ అయ్యారు. దీంతో గత కొంతకాలంగా ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు కుట్లు వేయాలన్నా, కట్లు కట్టాలన్నా సెక్యూరిటీ గార్డ్తోనే చేయిస్తున్నారు.
వంద పడకలున్న ఈ ఆసుపత్రిలో ఇద్దరు ఎమ్ఎన్ఓలు ఉండాల్సినప్పటికీ ఒక్కరు కూడా లేరు. రాజమహేంద్రవరం జనరల్ ఆసుపత్రి నుంచి ఒకరిని డిప్యూటేషన్‌పై నియమించారు. కానీ అతను వారంలో సగం రోజులు రాజమహేంద్రవరంలోనూ, సగం రోజులు రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలోనూ విధులు నిర్వహిస్తుంటాడు. దీంతో రోగులకు కనీస స్థాయిలో కూడా వైద్యసేవలు అందడం లేదు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని రోగులు కోరుతున్నారు.
ఇదీ చూడండి. 'వైకాపా ప్రభుత్వం పాలనలో విఫలమైంది..'