తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఓ దాత బిస్కెట్లు పంచిపెట్టారు. పట్టణంలో ఒక కాలనీకి చెందిన నిరుపేదలు ఆ బిస్కెట్ల కోసం ఒకరిని ఒకరు తోసుకున్నారు. తీరా అతి కొద్దిమందికే ఆ బిస్కెట్లు దక్కడంతో మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. లాక్డౌన్ కారణంగా ఆహారం కోసం ఇలా ఎందరో నిరుపేదలు దయనీయ పరిస్థితుల మధ్య చేతులు చాస్తున్నపరిస్థితులు నెలకొన్నాయి.
అమలాపురంలో నిరుపేదల ఆకలి కేకలు - అమలాపురంలో నిరుపేదల ఆకలి కేకలు
లాక్డౌన్ కారణంగా అన్నార్తుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఎవరైనా దాతలు సాయం చేసేందుకు ముందుకువస్తే.. వారి వద్దకు గుంపులు గుంపులుగా చేరుకుంటున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఆకలి భరించలేక.. దాతలు చేసే సాయం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. అమలాపురంలో ఓ దాత బిస్కెట్లు పంచిపెడితే..వాటి కోసం చిన్న పిల్లల మెుదలుకొని పెద్దల వరకు అంతా రహదారి మీదకు వచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఈ ఘటనతో జానెడు పొట్టను నింపుకునేందుకు ఎంతోమంది పడుతున్న తిప్పలు హృదయాన్ని కదలిస్తున్నాయి.
బిస్కెట్ల కోసం నిలబడ్డ ప్రజలు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఓ దాత బిస్కెట్లు పంచిపెట్టారు. పట్టణంలో ఒక కాలనీకి చెందిన నిరుపేదలు ఆ బిస్కెట్ల కోసం ఒకరిని ఒకరు తోసుకున్నారు. తీరా అతి కొద్దిమందికే ఆ బిస్కెట్లు దక్కడంతో మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. లాక్డౌన్ కారణంగా ఆహారం కోసం ఇలా ఎందరో నిరుపేదలు దయనీయ పరిస్థితుల మధ్య చేతులు చాస్తున్నపరిస్థితులు నెలకొన్నాయి.
ఇదీ చూడండి:యానాంలో పటిష్టంగా లాక్డౌన్