తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం సంధిపూడిలో పారిశుద్ధ్య కార్మికుడు ఉరి వేసుకుని మృతి చెందాడు. వాసుపల్లి నాగేంద్రబాబు అనే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం తాను నివసించే పాకలో ఉరి వేసుకుని మరణించాడు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి..