ETV Bharat / state

యంత్రం ఉందిగా.. చింత లేదిక.. - sanitary napkins at east godavari government schools

తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో రుతురుమాళ్ల యంత్రాలు (శానిటరీ నాప్​కిన్​ యంత్రం) అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు ఉపయోగపడే రీతిలో ప్రభుత్వం వీటిని ఆయా పాఠశాలల్లో అమర్చుతోంది. విద్యుత్తు ఆధారంగా ఇవి పని చేస్తాయి.

sanitary napkins at east godavari government schools
తూర్పుగోదావరి ప్రభుత్వ పాఠశాలల్లో శానిటరీ నాప్​కిల్లు
author img

By

Published : Mar 19, 2020, 10:39 AM IST

Updated : Mar 20, 2020, 2:45 PM IST

తూర్పు గోదావరి ప్రభుత్వ పాఠశాలల్లో శానిటరీ నాప్​కిన్​లు

బాలికలకు వ్యక్తిగత శుభ్రత నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాలోని 324 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శానిటరీ నాప్​కిన్​ యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. జిల్లాలో 624 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.. తొలివిడతగా 324 పాఠశాలల్లో యంత్రాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఈఎస్ అబ్రహం తెలిపారు.

విద్యార్థినులు పాఠశాలకు వచ్చిన తర్వాత అవసరం వచ్చినప్పుడు యంత్రంలో అమర్చిన నాప్​కిన్​లు తీసుకునే విధంగా అమర్చుతారు. ఒక్కో యంత్రంలో 26 సెట్ల రుతురుమాళ్లుంటాయి. ఒక్కో సెట్​లో మూడు ఉంటాయి. రుతురుమాళ్లు అవసరమైన విద్యార్థిని యంత్రంలో కాయిన్​ వేస్తే ఒక సెట్​ బయటకు వస్తుంది. దాంట్లో ఒక దానిని వినియోగించుకుని మిగిలిన రెండు ఇంటికి తీసుకెళ్లవచ్చు. వీటిని విద్యార్థినులకు ఉచితంగా ఇస్తారు. వినియోగించినవాటిని బటయపడేయకుండా దానిని బూడిద చేసే యూనిట్​లో వేయాలి.

విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా రుతురుమాళ్లు విద్యాశాఖ ద్వారా పాఠశాలలకు సరఫరా చేస్తారు. వీటిని పాఠశాలలో ఒక ఉపాధ్యాయిని వద్ద ఉంచుతారు. కాయిన్​లు కూడా ఆమె వద్ద ఉంటాయి. కావలసిన వారు ఆమె వద్ద కాయిన్​ తీసుకుంటారు. దాని ఆధారంగా ఈ యంత్రం నుంచి రుతురుమాళ్లు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలి.

ఇదీ చదవండి:

కరోనా తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన రైల్వేశాఖ

Last Updated : Mar 20, 2020, 2:45 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.