తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ ఇసుక ర్యాంపుల వద్ద.. లారీ యూనియన్ల సభ్యులకు ఇతర ప్రాంత లారీ డైవర్లకు మధ్య వివాదం జరిగింది. ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇసుక తీసుకెళ్లేందుకు జొన్నాడ ఇసుక ర్యాంపు వద్దకు లారీలు అధిక సంఖ్యలో వస్తున్నాయి. వాహనాలు వరుస క్రమంలో కాకుండా మరో మార్గంలో వచ్చి ఇసుక తీసుకెళ్తున్నాయి. ఇలా అయితే వరుసల్లో ఉన్నవారు ఏమైపోవాలని.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు 2, 3 రోజులు పడుతుందని కొందరు లారీ డ్రైవర్లు ఆందోళన చేశారు. దాంతోపాటు పార్కింగ్ ఫీజులు తగ్గించాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పటంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చూడండి..
శునకంలా ప్రవర్తిస్తున్న యువకుడు- ఎందుకు?