కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఏడు శనివారాల నోము కోసం.. ఏడువారాల వెంకన్న దర్శనం కోసం.. రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో శనివారం స్వామి దర్శనం కోసం తరలి వెళ్లారు. క్యూ లైన్లన్నీ నిండిపోయాయి.
స్వామి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. గత శనివారం స్వామివారిని 51 వేల మంది దర్శించుకున్నారనీ... అదే స్థాయిలో నేడు కూడా వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామనీ... అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇదీ చదవండి: