శిథిలావస్థలో పాత కోరంగి రోప్ వే బ్రిడ్జ్ తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం పాత కోరంగి - కొత్త కోరంగితో పాటు మరో 5 గ్రామాలను కలుపుతూ ఓ రోప్‌వే వంతెన ఉంది. లోక్‌సభ మాజీ స్పీకర్ జి.ఎం.సి బాలయోగి చొరవతో 1999లో గోదావరి నదిపాయపై ఇనుప తీగల వంతెన నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుంది. పదేళ్ల క్రితం.. వంతెనకు జిల్లా పరిషత్ నిధులతో ఒకసారి తాత్కాలిక మరమ్మతులు చేశారు. గత పదేళ్ల నుంచి ఎటువంటి నిర్వహణకు నోచుకోక ప్రధాన తీగకు అనుసంధానంగా ఉండే ఇనుప రాడ్లు వదులైపోయాయి. వాహనాలు వెళ్లే దారిలో ఉండే రేకులు తుప్పుపట్టి రంధ్రాలు ఏర్పడ్డాయి. చుట్టుపక్కల గ్రామాల వారు నిత్యం రాకపోకలు సాగించే మార్గం కావటం వలన..ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వంతెన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి :
ఆలమూరులో ఎక్సైజ్ అధికారుల దాడులు... 160 లీటర్ల నాటుసారా స్వాధీనం