ETV Bharat / state

క్రీడలతో చిన్నారుల్లో పోటీతత్వం: కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి - క్రీడలతో చిన్నారుల్లో పోటీతత్వం: కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

క్రీడలతో చిన్నారుల్లో మానసిక, శారీరక దృఢత్వంతోపాటు పోటీతత్వం పెరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. రాజమహేంద్రి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో 32వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అంతర్‌ జిల్లాల రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల ర్యాలీని పుష్కర్‌ఘాట్‌ వద్ద గురువారం ఆయన ప్రారంభించారు.

Roller  Skating Collector
Roller Skating Collector
author img

By

Published : Feb 26, 2021, 12:08 PM IST

గత సంవత్సరకాలంగా కొవిడ్‌ లాక్‌డౌన్‌తో విద్యార్థులు క్రీడలకు దూరంగా ఉన్నారని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. వారికి ఇలాంటి పోటీలు ప్రోత్సాహాన్ని అందిస్తాయన్నారు. సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి మాట్లాడుతూ క్రీడాకారులు విజయపరంపర కొనసాగించాలన్నారు. డీఈవో ఎస్‌.అబ్రహం మాట్లాడుతూ విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. నిర్వాహకులు టి.కె.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తొలిసారి రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని, 13 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు వివిధ అంశాల్లో పాల్గొంటారన్నారు. పోటీలను మార్చి 3 నుంచి 8వతేదీ వరకు సంపత్‌నగరంలోని పాఠశాల ఆవరణలో నిర్వహిస్తామన్నారు. పుష్కర్‌ఘాట్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ కంబాలచెరువు వద్దనున్న వివేకానంద విగ్రహం వద్ద ముగిసింది.

ఇదీ చదవండి: పుర ఎన్నికల ప్రక్రియ పున:ప్రారంభం.. ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.