తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సహకరించలేదని వైకాపా నాయకులు తన ఇటుక బట్టికి వెళ్లే రహదారికి రెండు వైపుల గండ్లు పెట్టారని ముక్తాబత్తుల వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. దారికి ఇరువైపులా గండ్లు కొట్టటంతో ఇటుక బట్టికి వెళ్లేందుకు మార్గం లేకుండా చేశారని... దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. లంకల గన్నవరం గ్రామ పంచాయతీ ఎన్నికలలో తెదేపా, జనసేన బలపరిచిన అభ్యర్థి సర్పంచిగా గెలుపొందారు.
ఇదీ చదవండి