కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో 144 సెక్షన్ అమలులో ఉంది. యానాంలో జరుగుతున్న పనులను పుదుచ్చేరి ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ రెడ్డి పరిశీలించారు. చెక్పోస్ట్ వద్ద వాహనాలు ఆపాలని ఆయన సిబ్బందికి సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు చేసి శిక్షలు వేయాలన్నారు.
ఇక.. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఉగాది పర్వదినాన్ని ఏకాంతంగా నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే స్వామివారి దర్శనాలు నిలిపివేశారు. ప్రత్యేక పూజలు అనంతరం పండితులు పంచాంగ పఠనం చేశారు. పల్లకి సేవ జరిగింది. సర్వరోగ నివారణకు అర్చకులు యాగం చేశారు.
రాజానగరం నియోజకవర్గంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే జాతీయ రహదారి సైతం ఖాళీగా దర్శనమిచ్చింది. ఎక్కడికక్కడ పోలీసులు రోడ్లపై గస్తీ కాశారు. వాహనాదారులు రోడ్డెక్కాలంటే భయపడుతున్నారు.
ఇదీ చూడండి: