East godavari accident:తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొన్న ఘటనలో చింతూరు గ్రామానికి చెందిన గణేష్(32), అతని తమ్ముడు సాయి అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న రాజమండ్రికి చెందిన డ్రైవర్ కొనుతుల గణేష్, రంపచోడవరం మండలం పోలవరానికి చెందిన సత్తిబాబు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని అంబులెన్స్‌లో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డ్రైవర్ గణేష్ తెలియజేసిన వివరాల ప్రకారం...రాజమహేంద్రవరం బొల్లినేని ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ వద్ద సహాయకునిగా పనిచేస్తున్న గణేష్...అతని తమ్ముడు సాయిని చింతూరు తీసుకువెళ్తుండగా దేవరపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ప్రమాదవశాత్తు కారు.. చెట్టును ఢీకొంది. దీంతో గణేష్, సాయి అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: