ETV Bharat / state

నాడు అన్నం పెట్టినవారే.. నేడు ఆకలితో అలమటిస్తున్నారు

author img

By

Published : Aug 3, 2020, 4:09 PM IST

టీ..కాఫీ నుంచి టిఫిన్, భోజనంతయారీ..వరకూ, కర్రీపాయింట్ నుంచి కేటరింగ్ వరకూ.. ఇలా విస్తరించుకుంటూ పోయింది హోటల్ వ్యాపారం. నాడు ఆకలేసే వారికి అన్నం పెట్టేవారు.. నేడు వారే ఆకలితో అలమటిస్తున్నారు. ఇది హోటల్ సిబ్బంది దీనస్థితి.

carona effect on resturants
నాడు అన్నం పెట్టినవారే నేడు ఆకలితో అలమటిస్తున్నారు

రెండు పచ్చిమిరపకాయలు సద్దన్నం ముద్దతో పొలం పనులు పోయే వాడికి ఫ్లాస్కులో వేడివేడి టీ కాఫీలు.. ఉల్లి దోసె, ఉప్మా పెసరట్టు అలవాటు చేశారు. భార్య భర్తలు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ వంట పని చేసుకునేవారికి.. కర్రీ పాయింట్ ద్వారా వంటగదిలో దూరేపని లేకుండా చేశారు. శుభకార్యాలు పెళ్లిళ్లు సందర్భాల్లో కుటుంబ సభ్యులు బంధువులంతా కలిసి రకరకాల వంటకాలు సిద్ధం చేసే కొసరి కొసరి వడ్డించే వారు. కేటరింగ్ పేరుతో అంతా తామై ప్లేట్ లెక్కన పెట్టుకుపోతున్నారు. దీని ద్వారా మనకు సమయం కలిసి వచ్చి వందల మందికి ఉపాధి లభించేది. ఇదంతా కరోనా ముందు కాలం వరకు..

ఇప్పుడు కరోనా మహమ్మారి హోటల్లు.. రెస్టారెంట్ లో పని చేసే వందలాది మందికి పని లేకుండా చేసింది. టీ మాస్టర్లూ.. కుక్ లు..సర్వర్..స్వీపర్.. ఇలా పది విభాగాల్లో రోజువారి పని చేసుకుంటూ కుటుంబాలు పోషించుకునే వీరంతా గత నాలుగు నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలకు ఒకటి రెండు నెలలు కొంతవరకు ఆదుకున్న వ్యాపారం నాలుగు నెలలు పూర్తిగా మూసివేయడంతో సహకరించలేకున్నారు.

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లోని గ్రామాల్లోని పొలిమేర్లలో ఉంటే టీ దుకాణాల నుంచి మండల కేంద్రాల్లో ఉండే ఒక మాదిరి హోటల్ వెయ్యికి పైబడే ఉన్నాయి. యానంలోనూ 6 వరకు రెస్టారెంట్లు ఉన్నాయి. ఒక్కో హోటళ్లను 10 నుంచి 20 మంది వరకు పని చేస్తుంటారు. వీరంతా ప్రభుత్వం ఎప్పుడు హోటళ్లకు పూర్తిస్థాయి అనుమతి ఇస్తుందా...పని దొరికితాదా లేదా అని ఎదురుచూస్తున్నారు. వేరే పనులకు వెళ్ళలేక అప్పులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు.

ప్రతి రోజూ వందల మందికి వండి వడ్డించే చేతులు ఇప్పుడు ఎవరు పట్టెడన్నం పెడతారా అని ఎదురు చూస్తున్నాయి. హోటల్ నడిచినంత కాలం తిండికి లోటు లేదు. కరోనాతో మూత పడిన తర్వాత తినడానికి లేదని వాపోతున్నారు. ప్రభుత్వం హోటళ్లు తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి కరోనా పాజిటివ్​ వ్యక్తి అత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.