ETV Bharat / state

ఆర్టీసీపై కొవిడ్ తీవ్ర ప్రభావం..తగ్గిన ఆదాయం

కొవిడ్ ప్రభావం ఆర్టీసీపై పడింది. ప్రయాణికులు లేక ఆర్టీసీ కాంప్లెక్స్​లన్నీ వెలవెలబోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని అమలాపురం, రాజోలు, రావులపాలెం డిపోల ఆదాయం భారీగా తగ్గింది.

author img

By

Published : Apr 27, 2021, 8:54 AM IST

కరోనాతో ఆర్టీసీ కుదేలు
కరోనాతో ఆర్టీసీ కుదేలు

కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా.. వివిధ రంగాలపై దీని ప్రభావం పడుతోంది. ఈ నెల 20 నుంచి ఆర్టీసీపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని అధికారులు అంటున్నారు. ప్రయాణికులు తగ్గిపోవడంతో ఆర్టీసీ కాంప్లెక్స్​లు వెలవెలబోతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో అమలాపురం, రాజోలు, రావులపాలెం ఇలా మూడు డిపోలు ఉన్నాయి. రైలు మార్గం లేని కోనసీమకు ఏకైక మార్గం రోడ్డు రవాణా. ఈ కారణంగా ఇక్కడ ఆర్టీసీకి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ కరోనా కారణంగా బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పడిపోయింది.

అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి రోజుకు 132 బస్సులు నడుస్తాయి. నిత్యం 12 వేల మంది ప్రయాణికులను గమ్యానికి చేరుస్తాయి. అలాంటిది ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ముప్పై బస్సులను డిపోలో నిలిపివేసినట్లు అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ టీవీఎస్ సుధాకర్ తెలిపారు. ఈ ఒక్క డిపో పరిధిలోనే రోజుకి ఐదువేల మంది ప్రయాణికులు తగ్గిపోయారు. ఈ కారణంగా ఈ డిపోకు రోజుకు ఆరు లక్షల ఆదాయం తగ్గిపోయింది. ఇదే పరిస్థితి రావులపాలెం, రాజోలు డిపోల్లో సైతం నెలకొంది.

ఇదీ చదవండి

రాష్ట్రానికి పొంచి ఉన్న ఆక్సిజన్ సమస్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.