తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం బాలుర గురుకుల పాఠశాలలో.. 1997లో 10వ తరగతి చదివిన విద్యార్థులంతా ఈరోజు కలుసుకున్నారు. అప్పట్లో వారికి పాఠాలు బోధించిన గురువులు పీఎస్ఆర్ ఆంజనేయులు, డీఎస్పీ శంకర్లను ఘనంగా సన్మానించారు.
ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు ఇతర కార్యవర్గాన్ని నియమించుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో తమ అసోసియేషన్ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
చౌక దుకాణాల్లో నాసిరకం సరకు.. నిరాకరిస్తున్న బియ్యం కార్డుదారులు