గోదావరి గట్టున ఇరుక రహదారిలో ఇసుక ర్యాంపు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చేపట్టారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న కన్నమ్మ గుడి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపును నిలిపివేయాలంటూ నిరసన తెలిపారు. ఇదే ప్రాంత సమీపంలో ఇసుక ర్యాంపులు ఉన్నా.. కొత్తగా మరో ర్యాంపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించారు. ర్యాంపుకు అనుమతి ఇవ్వొద్దని అధికారులకు ఫిర్యాదు చేసినా....పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఇసుక ర్యాంపును తొలగించాలని డిమాండ్ చేశారు. వీరికి మాజీ ఎంపీ హర్ష కుమార్ మద్దతు తెలిపారు.
ఇవీ చూడండి...