ETV Bharat / state

'తరగతి గదిలో వివాహం కేవలం ప్రాంక్ వీడియోనే' - రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతి గదిలో పెళ్లిపై ప్రిన్సిపాల్ స్పందన

తరగతి గదిలో విద్యార్థులు పెళ్లి చేసుకున్న ఘటన నిజం కాదని.. కేవలం టిక్​టాక్ తరహా ప్రాంక్ వీడియో అని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. వారిరువురిపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కానివ్వమని స్పష్టం చేశారు.

college principal
మాట్లాడుతున్న ప్రిన్సిపాల్
author img

By

Published : Dec 4, 2020, 2:57 AM IST

సంచలనం రేపిన తరగతి గదిలో మైనర్ల వివాహ వీడియోపై.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ స్పందించారు. ఈ వీడియో గత నెల 17న ఉదయం 8.30 గంటలకు తీసిందని వెల్లడించారు. టిక్​టాక్​ తరహా ప్రాంక్ వీడియో తీసుకునేందుకు ఇరువురు విద్యార్థులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు.

నవంబర్ 2 నుంచి కళాశాలలు ప్రారంభం కాగా.. బాల బాలికలను వేర్వేరుగా కూర్చోపెడుతున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాల పనివేళలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.00 కాగా.. ఈ ఘటన ఉదయం 8.30కు జరిగినట్లు వివరించారు. ఆ సమయంలో ఇతర విద్యార్థులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో.. విషయం తమ దృష్టికి రాలేదన్నారు. విషయం తెలిసిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పారు.

అనుబంధ కథనం:

వైరల్: తరగతి గదిలో.. స్నేహితుల సమక్షంలో.. మైనర్ల వివాహం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.