తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానంలో రాజా వాషరమెన్ సొసైటీ ఆధ్వర్యంలో రజకులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనకూడదని బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి చాకిరేవు రజక సంఘం అధ్యక్షులు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 70 ఏళ్లుగా చాకిరేవు చెరువులో రజకులు బట్టలు ఉతుకుతూ జీవనం సాగిస్తున్నారని.. ఇప్పుడు ఆ స్థలాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించడం అన్యాయమని అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ వెంటనే నిలిపివేయాలని రజకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: