తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రహదారుల నాణ్యత, భవనాల నాణ్యతను పరిశీలించే క్యాలిటీ కంట్రోలన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రూ. 20 లక్షల రూపాయల నిధులతో ఈ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌ను నిర్మించారు. ఇంతవరకు జిల్లా కేంద్రంలో మాత్రమే ఇలాంటి ల్యాబ్ ఉందని.. రాష్ట్రంలోని డివిజన్ కేంద్రంలో తొలిసారిగా అమలాపురంలో ల్యాబ్ ఏర్పాటు అయిందని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ రాంబాబు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టే వివిధ భవనాలు, రహదారులు, ఇతర కట్టడాల నాణ్యత పరిశీలించేందుకు ఈ ల్యాబ్ నిర్మించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు