ETV Bharat / state

PROTEST: 'ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పదవి రీకాల్ చేయాలని నిరసన'

author img

By

Published : Jul 17, 2021, 9:27 PM IST

రాజమహేంద్రవరంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పదవి రీకాల్ చేయాలంటూ దళిత, వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గోకవరం బస్​ స్టాండ్​లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు.

నిరసన చేపట్టిన దళిత, ప్రజా సంఘాలు
నిరసన చేపట్టిన దళిత, ప్రజా సంఘాలు

శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తోట త్రిమూర్తులును ఎమ్మెల్సీ పదవి నుంచి రీకాల్ చేయాలంటూ రాజమహేంద్రవరంలో దళిత, వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గోకవరం బస్​స్టాండ్​లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. 25 ఏళ్లుగా న్యాయస్థానంలో ఉన్న కేసును సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

పెద్దల కోటాలో విద్యావంతులకు ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ పదవిని ముఖ్యమంత్రి జగన్.. తోట త్రిమూర్తులుకు ఇవ్వడం దారుణమని ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

ఇదీ చదవండి:

AP NOMINATED POSTS 2021: నామినేటెడ్ పదవులు దక్కింది వీరికే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.