తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని గొందిలో రొయ్యల చెరువుల తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. గ్రామస్థులు ఆందోళన చేశారు. మంచినీటి చెరువు సమీపంలో 13 ఎకరాలలో గుంతలు తవ్వుతుండటంతో తాగునీరు కలుషితమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై గతంలో ఫిర్యాదు చేయగా.. అప్పుడు తవ్వకాలు ఆపేశారని, ప్రస్తుతం మళ్లీ అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని నిరసనకారులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇదీచదవండి.